క‌రోనాతో జాస్ యాక్ట‌ర్ లీ ఫీరో మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో సెల‌బ్రిటీని బ‌లితీసుకుంది. 1975లో స్టీఫెన్ స్పిల్‌బ‌ర్గ్ రూపొందించిన జాస్ (ద‌వ‌డ‌లు) సినిమాలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన న‌టి లీ ఫీరో (91) క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. జాస్ సినిమాలో ఆమె కిట్న‌ర్ కు తల్లిగా న‌టించారు పోషించారు. అమెరికాలోని ఓహియోలో నివాస‌ముంటున్న ఆమె మ‌ర‌ణించార‌ని ఐలాండ్ థియేట‌ర్ వ‌ర్క్‌షాప్ ప్రెసిడెంట్ కెవిన్ ర్యాన్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. మార్తాస్ వైన్‌యార్డ్‌లో ఉన్న ఈ సంస్థ‌కు ఫీరో గ‌త 25 ఏండ్లుగా మెంటార్‌గా కూడా ప‌నిచేస్తున్నారు. ఇక్క‌డే ఆమె 40 ఏండ్లుగా ఉంటున్నారు. ఆమెతో నేను 30 ఏండ్లుగా క‌లిసి ప‌నిచేస్తున్నాను. లీ మృతి మాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అని ర్యాన్ పేర్కొన్నారు.